ఆర్జీవీ డెన్‌ చూశారా!

సినిమా పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ ప్రత్యేకంగా నిలుస్తుంటారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారాయన. తాజాగా హైదరబాద్‌లోని తన కార్యాలయ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘సైకిల్‌ చైన్, తుపాకి మధ్యలో ఉంది నా డెన్‌’ అనే వ్యాఖ్యను జోడించాడు. ఈ ఫొటోలో ఓ వైపు సైకిల్‌ చైన్, మరో తుపాకి కనిపిస్తాయి. మధ్యలో ఓ పెద్ద కిటికీ దర్శనమిస్తుంది. ఆర్‌.జి.వి. కంపెనీ అని ఆంగ్ల అక్షరాల లోగో ఉంది. ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో అభిమానులు కామెంట్స్‌ పెడుతూ ఆర్జీవీని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.