‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ నుంచి తీపి కబురు వినిపించారహో..

సినీప్రియులంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ప్రతిష్ఠాత్మక మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు సంబంధించి ఓ తీపి కబురు అందింది. తాజాగా చిత్ర బృందం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రీకరణ మొదలై నేటికి ఏడాదైంది. ఇప్పటి వరకు 70శాతం చిత్రీకరణ పూర్తయింది. గతకొన్నాళ్లుగా వినిపిస్తున్న కొన్ని ఊహాగానాలకు తెరదించే సమయం వచ్చింది. ఎన్టీఆర్‌ సరసన ఎవరు కనిపించబోతున్నారు? ప్రతినాయకులు ఎవరు? వంటి వివరాలు రేపు (నవంబరు 20న) చెబుతాం’’ అంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించబోతుండగా.. కొమురం భీం పాత్రను తారక్‌ పోషిస్తున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ కథానాయిక ఆలియాభట్‌ కనిపించనుండగా.. అజయ్‌ దేవగణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘బాహుబలి’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత దర్శకుడు రాజమౌళి నుంచి రాబోతున్న చిత్రం కావడంతో దీనిపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.