బాలయ్య చిత్రం పేరు ‘రూలర్‌’!

బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకి ‘రూలర్‌’ అనే పేరును పరిశీలనలలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సినిమా పేరును అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ చిత్రం శాటిలైట్‌ హక్కులను జెమిని సొంతం చేసుకొంది. ఇదే విషయాన్ని జెమినీ టీవీ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా ‘రూలర్‌’ చిత్రం పోస్టర్‌ను పోస్ట్‌ చేసి శాటిలైట్‌ హక్కులు పొందినట్లు తెలియజేసింది. అయితే సినిమా టైటిల్‌ని చిత్రబృందం కాకుండా ఇలా శాటిలైట్‌ హక్కులను కొనుగోలు చేసిన సంస్థ ప్రకటించడంతో సినిమా టైటిల్‌ ‘రూలర్‌’రే కావచ్చని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. మరో వైపు ఈ సినిమా టైటిల్‌ని శాటిలైట్‌ హక్కులు పొందిన సంస్థ ప్రకటించడం బాగాలేదని బాలయ్య అభిమానులు కొంతమంది అసహనానికి గురైయ్యారని వార్తలొస్తున్నాయి. మొత్తం మీద బాలకృష్ణ కొత్త సినిమా పేరుకి ఉత్కంఠతకి తెరపడింది. సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్, వేదికలు కథనాయికలుగా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, భూమిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.