బస్టాప్‌లో సాయిపల్లవి.. ఒక్కరైనా గుర్తించలే!!

ది వరంగల్‌ జిల్లాలోని పరకాల్‌లోని ఓ బస్టాప్‌. ఉదయం సమయంలో ఓ స్టార్‌ హీరోయిన్‌ బస్సు ఎక్కేందుకు ఓ సాధారణ ప్రయాణికురాలిలా బస్టాండ్‌లోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న బల్లపై తోటి ప్రయాణికులతో కలిసి కూర్చొని బస్సు కోసం ఎదురు చూసింది. కాసేపటికి బస్సు రావడంతో అందరితో కలిసి బస్సెక్కి వెళ్లిపోయింది. కానీ, అంతవరకు ఒక్కరు కూడా ఆమెను గుర్తుపట్టలేదు. కొందరు మాత్రం ఆమె హైబ్రీడ్‌ పిల్ల అని.. ‘భానుమతి’ అంటూ ‘ఫిదా’ చేసిన స్టార్‌ నాయిక సాయిపల్లవి అని గుర్తుపట్టి వీడియో తీసి నెట్టింట అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఇప్పుడిది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ భామ రానా కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’లో నాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో భాగంగానే అక్కడి పరకాల బస్టాండ్‌లో సాయి పల్లవిపై ఓ సీన్‌ చిత్రీకరించారు. అయితే అది ఎక్కడా షూట్‌ అని జనానికి తెలియకుండా దగ్గరలోని ఓ హోటల్‌లో కెమెరా పెట్టి చిత్రీకరణ జరిపారు. ఇక సాయి పల్లవి కూడా ఓ సాధారణ ప్రయాణికురాలిలాగే బస్టాప్‌కు చేరుకోవడం, అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగిపోయాయి. కానీ, కొందరు ఆమెను గుర్తించి ఈ తతంగాన్నంతా వీడియో తీయడంతో ఇప్పడది కాస్త వైరల్‌ అయిపోయింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.