భాయ్‌.. దాదాల స్నేహగీతిక!!
మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌కు మంచి అనుబంధం ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. చిరుకు కూడా సంజయ్‌ అంటే ఓ ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన సంజయ్‌ హిట్‌ చిత్రాలు ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగేరహో మున్నాభాయ్‌’లను తెలుగులో ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’గా రీమేక్‌ చేసి బ్లాక్‌బస్టర్‌లు అందుకున్నారు.


 సంజు కూడా చరణ్‌ తొలి బాలీవుడ్‌ సినిమా ‘తుఫాన్‌’లో ఓ ముఖ్యపాత్రలో కనినిపించి తమ మధ్య అనుబంధం గొప్పతనాన్ని అందిరికీ తెలిసేలా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా రామ్‌ చరణ్, ఉపాసన దంపతులు కలిసి నిర్వహించి ఓ వేడుకకు సంజయ్‌ దత్‌ అతిథిగా వచ్చి సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న సంజయ్‌.. అక్కడ చిరు, చరణ్‌లతో కలిసి ముచ్చటిస్తున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ ఫొటోలను ఉపాసన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రాల్లో సంజు, చిరుల అనుబంధం చూసి అభిమానులంతా ముచ్చటపడుతున్నారు. భాయ్‌.. దాదాల స్నేహం ముచ్చటగొలిపేలా ఉందంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.