‘దళపతి’ తరువాత మరోసారి
ఛాయాగ్రాహకుడిగా సంతోష్‌ శివన్‌కు మంచి పేరు సాధించారు. ఆయనే కెమెరామెన్‌గా కావాలి అనుకొనే దర్శకులు, హీరోలు ఉన్నారు. అటువంటి పనితనం కలిగిన వ్యక్తి శివన్‌. సుమారు 28 సంవత్సరాల తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్రానికి మళ్లీ పనిచేయబోతున్నారు. 1991లో రజనీకాంత్‌ నటించిన ‘దళపతి’ చిత్రానికి ఆయన పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ రజనీకాంత్‌ చిత్రానికి కలసి పనిచేసే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. తాజాగా మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథనాయకుడిగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కలిసి పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంతోష్‌ ట్వీట్‌ చేస్తూ ‘‘చాలా ఎగ్జయిటింగ్‌’’ గా ఉందన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.