మురిపిస్తున్న సితార డ్యాన్స్‌

అందాల నటుడు మహేష్‌బాబు తనయ సితార ఏం చేసినా చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రతి ఇంట్లో తమ చిన్నారులు చేసే సందడి చూస్తే చుట్టుఉన్న మిత్రులకు, బంధువులకు చెప్పి సంబరపడిపోతాం. ఇప్పుడు అలాంటి వీడియోను నమ్రతా మహేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ముద్దుల తనయ సితార ‘మహర్షి’ చిత్రంలోని ‘పాల పిట్ట’ పాటకు నృత్యం చేస్తూ ఇరగదీసింది. ఈ సందర్భరంగా ఆ వీడియో..‘ఉఫ్‌..నువ్వు ఎంత చక్కగా ఉన్నావో. నేను ప్రతిరోజు సంతోషంగా నవ్వడానికి నువ్వే కారణం అవుతున్నావంటూ..పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగవైరలవుతోంది.


View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.