ముద్దుల తనయకు ప్రిన్స్‌.. ఎమోషనల్‌ బర్త్‌డే విసెష్‌

‘‘నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో ప్రత్యేకం’’.. అంటూ తన ముద్దుల తనయ సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మహేష్‌బాబు. శనివారం సితార ఏడో పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తన గారాల పట్టికి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు మహేష్‌. సితూ పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది తీసిన ఆమె ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘హ్యాపీ బర్త్‌డే సితార. కాలం చాలా వేగంగా పరుగులు తీస్తోంది. నీతో గడిపిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం. నువ్వు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా. నీ జీవితం ప్రేమ, సంతోషం, సానుకూల దృక్పథాలతో నిండాలని కోరుకుంటున్నా. ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి.’’ అంటూ పోస్ట్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు మహేష్‌. ఆ సందర్భంగా నమ్రత కూడా సితారకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నువ్వు ఓ అందమైన మహిళగా ఎదగాలని కోరుకుంటున్నా. నీదైన మార్గంలో నడుస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకో. నీ కోసం నీ కుటుంబం ఎప్పుడూ నీ వెంటే ఉంటుందన్న సంగతి గుర్తు పెట్టుకో. నీకు జన్మదిన శుభాకాంక్షలు’’ అని తన పోస్ట్‌లో పేర్కొంది నమ్రత. ప్రస్తుతం వీరంతా కశ్మిర్‌లో ఉన్నారు. సితార పుట్టిన రోజు వేడుకలను అక్కడే నిర్వహించారు.

View this post on Instagram

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.