ఎవరైనా సినిమా శుభాకాంక్షలు ఏ దీపావళికో, సంక్రాతికో తెలుపుతారు కానీ యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం ‘సింగిల్ డే’ శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. ‘‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సింగిల్ ఆర్మీ, హ్యపి సింగిల్స్ డే... ఎప్పుడైనా ఎక్కడైనా’’ అంటున్నాడు. అయితే ఇదంతా తన తదుపరి చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ కోసమే. ఈ రోజు ‘సింగిల్స్ డే’ కూడా. మరి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలకు ఇంతకన్నా మంచి రోజు ఎప్పుడు దొరుకుతుంది? అందుకే ఫస్టలుక్ని విడుదల చేస్తూ ‘సింగిల్స్ డే’ శుభాకాంక్షలు తెలిపింది చిత్ర బృందం. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటున్న ఈ చిత్రంలో కథానాయిక నభా నటేష్ కూడా ఉంది. బీవీఎస్యన్ ప్రసాద్ నిర్మాత. ప్రస్తుతం తేజ్ ‘ప్రతి రోజు పండగే’ చిత్రం డిసెంబర్లో విడుదలకానుంది.
