కారుతో.. సుధీర్‌బాబు...

తెలుగు హీరో సుధీర్‌బాబు సినిమాల్లోకి రాకముందు బ్యాడ్మింటన్‌ ఆటగాడు అన్న సంగతి తెలిసిందే. చిత్రసీమలోకి ప్రవేశించాక సుధీర్‌బాబు జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. చాలా సినీ తారలు ఉదయాన్నే లేచి నడక, లేక జిమ్‌లో గడుపుతుంటారు. కానీ హీరో సుధీర్‌ బాబు ఇప్పుడు అవుట్‌డోర్‌లో కొత్త రకమైన ఫీట్‌ను చేస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాడు. కారుతో సుధీర్‌ చేస్తున్న ఫీట్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..మనం చేసే వ్యాయామం విసుగు లేకుండా ఉండాలి అంటే నా ఫిజికల్‌ ట్రైనర్‌ జాఫర్‌ అలీ చెప్పినట్టు నా కారును తోస్తున్నాను. ఇందువల్ల శారీరకంగా బాగుంటుంది. కొంచెం కారు ఇంధనం కూడా ఆదా అవుతుంది. మీరు కూడా ఇలా ప్రయత్నిండి..అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే చిత్రంలో నటిస్తున్నాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.