అన్న.. షూటింగ్‌కి తాత... కారు

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యన్‌టీఆర్‌’. ఇందులో ఇప్పటికే చాలామంది నటీనటులు పాలుపంచకున్నారు. అయితే అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం స్వయానా ఆయనే మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ హైదరాబాద్‌లోనే కొనసాగుతుంది. సుమంత్‌ షూటింగ్‌ స్పాట్‌కు బయలు దేరారు. ఎవరిలో కారులో అనుకుంటున్నారా తన తాత అక్కినేని వాడిన కారులోనే ప్రయాణిస్తూ అందుకు సంబంధించిన ఒక ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్‌ చేశాడు సుమంత్‌. ఆ సందర్భంగా ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఏఎయన్నార్‌ పాత్రలో నటించడానికి తాత వాడిన ఆఖరి కారులో నా తొలిరోజు షూటింగ్‌కి వెళ్తున్నా’నంటూ ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే చంద్రబాబునాయుడు పాత్రలో దగ్గుపాటి రానా నటిస్తున్నారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇంకా ఈ చిత్రంలో విద్యాబాలన్‌ బసవతారకం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే!© Sitara 2018.
Powered by WinRace Technologies.