సూపర్‌ ఛార్మింగ్‌ లుక్‌తో సూపర్‌స్టార్‌!
‘‘సూపర్‌ ఛార్మింగ్, సూపర్‌ ఫాస్ట్‌ సూపర్‌ స్టార్‌..’’ అంటూ ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ అవినాష్‌ గోవారికర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన మహేష్‌బాబు క్రేజీ లుక్‌ సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తాజాగా మహేష్‌ ఆయనతో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను అవినాష్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘‘సూపర్‌ ఛార్మింగ్, సూపర్‌ ఫాస్ట్‌ సూపర్‌ స్టార్‌.. మహేష్‌బాబుతో పోస్ట్‌ ప్యాకప్‌ షూట్‌’’ అని ఓ వ్యాఖ్య జత చేశారు. దీనిపై మహేష్‌ స్పందించారు. ‘‘మీ వర్కింగ్‌ స్టైల్‌ చాలా ఇష్టం. మీతో షూటింగ్‌ ఎప్పుడూ ఫన్‌గానే ఉంటుంది. ప్రత్యేకమైన మహారాష్ట్ర భోజనాన్ని ఎంజాయ్‌ చేశా’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను ఆయన పంచుకున్నారు. ‘‘నేను దీన్ని మిస్‌ అయ్యాను’’ అంటూ నమ్రత తన ప్రియమైన భర్త ఫొటోను షేర్‌ చేశా.© Sitara 2018.
Powered by WinRace Technologies.