సూర్య కేరాఫ్‌ సింప్లిసిటి!

సూర్య.. వెండితెరపై తన నటనతో ఎంతగా ఆకట్టుకుంటాడో, నిజ జీవితంలో ఆయన ప్రవర్తనతో అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఫొటో చూస్తుంటే అంతటి పేరు సంపాదించిన హీరో ఇంత సింపుల్‌గా ఉన్నాడేంటి అనిపిస్తుంది కదా. ఆయనే కాదు ఆయన సతీమణి,నటి జ్యోతిక, పిల్లలు కూడా అంతే. అందుకే సూర్య,జ్యోతిక పెళ్లి రోజు వేడుకను ఇలా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఏ హంగామా లేకుండా గార్డెన్‌లో కేక్‌ కట్‌ చేశారు. కొడుకు, కూతురు అప్పుడే ఆట నుంచి వచ్చినట్టున్నారు. చేతిలో బ్యాట్మింటన్‌ బ్యాట్‌తోనే ఉన్నారు. అక్కడ అందరి దృష్టి కేక్‌ కటింగ్‌పై ఉంటే సూర్య మాత్రం కెమెరా వైపు చూస్తూ పోజిచ్చాడు. తమ అందమైన ఫ్యామిలీ ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు సూర్య, జ్యోతిక.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.