‘అలా’ తబుసుమ్‌ హష్మి లుక్‌ విడుదల
తెలుగు నుంచి వచ్చే కథానాయికలే తక్కువ. అలాంటిది తెలుగులో అగ్ర కథానాయికగా గుర్తింపు పొంది, ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది తబుసుమ్‌ హష్మి. అప్పుడప్పుడు ఆంగ్ల చిత్రాల్లోనూ మెరుస్తుంది ఆమె. ఇంతకి తబుసుమ్‌ హష్మి అంటే ఎవరో కాదు అందాల తార టబు. అవును టబు అసలు పేరు తబుసుమ్‌ హష్మి. ఈ రోజు టబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల...వైకుంఠపురములో’ చిత్ర బృందం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రంలోని ఆమె లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.


‘ఆమె చూపులు మన హృదయాలను కొల్లగొడతాయి. ఆమె టాలెంట్‌తో ఎవరినైనా ఆకట్టుకోగలదు. టబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో మరిన్ని చిత్రాలు చేయాలని మేము ఎదురుచూస్తున్నాం’ అని చిత్ర బృందం పేర్కొంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.