తరుణ్‌ ఆతృత వెంకీ చిత్రం కోసమేనా??

రుణ్‌ భాస్కర్‌.. ‘పెళ్లిచూపులు,’ ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో సినీప్రియులకు దగ్గరయ్యాడు. ఓవైపు దర్శకుడిగా సత్తా చాటుతూనే ‘మహానటి’, ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రాలతో నటుడిగానూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ యువ దర్శకుడు తన మూడో చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారు. చేతిలో మైకు పట్టుకోని ఉన్న తన చిత్రాన్ని పోస్ట్‌ చేస్తూ.. ‘‘తర్వాతి ప్రాజెక్టు కోసం ఎంతో ఆతృతతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటించబోతున్నా’’ అని రాసుకొచ్చారు. అయితే తరుణ్‌ ఇంత ఎగ్జైట్‌ అయ్యేంతగా ఆ ప్రాజెక్టులో ఏముందా అని ఆరా తీస్తే.. ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. తరుణ్‌ ఇంతవరకు అంతా కొత్త నటీనటులతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. తొలిసారిగా వెంకటేష్‌ వంటి ఓ స్టార్‌ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కిందని.. అందుకే ఈ ప్రాజెక్టు కోసం తరుణ్‌ ఇంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నిర్మించనున్నారట. మరి ఇది తరుణ్‌ తన సొంత కథతో తెరకెక్కించనున్నాడా? లేక ఏదైనా బాలీవుడ్‌ రీమేకా? అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఇప్పటికే ‘దేదే ప్యార్‌ దే’ చిత్రాన్ని వెంకీతో రీమేక్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.