ఫేమస్‌ లవరా? లవ్‌ ఫెయిల్యూరా?

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటిస్తున్న తొమ్మిదో చిత్రమిది. క్రాంతి మాధవ్‌ దర్శకుడు. రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్, క్యాథరీన్,ఇజాబెల్లె కథానాయికలు. తాజాగా ఈ చిత్రంలోని విజయ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టైటిల్‌కు పోస్టర్‌కు చాలా తేడా ఉంది. ఇందులో గడ్డం పెంచుకుని సిగరెట్‌ కాలుస్తూ, ముఖంలో రక్తపు మరకలతో కనిపిస్తున్నాడు. నలుగురు కథానాయికలతో ప్రేమాయణం నడిపించే వాడు ఇలా ఎందుకు మారాడు. వరల్డ్‌ ఫేమస్‌ ఎలా అయ్యాడు? లవ్‌ ఫెయిల్యూర్‌ ఇందుకు కారణమా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే. ఏది ఏమైనా ఈ లుక్‌ యువతను ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో ఇప్పటికే వైరల్‌ అయింది. కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం గోపీ సుందర్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.