అంతరిక్షయాత్రికుడి.. దీపావళి సందడి!

నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్‌’. ఈ చిత్రానికి దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. అందమైన భామ లావణ్య తిప్రాఠితో పాటు మరో కథానాయకి అదితిరావు హైదరి కూడా నటిస్తుంది. దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికి ఆనందమే. ఈ ఆనంద దీపావళి పురష్కరించుకొని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో లావణ్య ఆరడుగుల వరుణ్‌తేజ్‌ను తదేకంగా చూస్తూఉంç,ే తెల్లని దుస్తులతో వరుణ్‌ చిరనవ్వులు చిందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందనే లభించింది. తొలిసారిగా పూర్తిస్థాయి అంతరిక్ష నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. హాలవుడ్‌ నిపుణులు తీర్చిదిద్దిన కొన్ని పోరాట దృశ్యాలు అబ్బురపరుస్తాయి. సాయిబాబు జాగర్లమూడి, క్రిష్, రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 21న విడుదల కానుంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.