‘వాల్మీకి’ 15న వస్తున్నాడు
హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమాలో వరుణ్‌ను సరికొత్త గెటప్‌లో చూపించనున్నాడు దర్శకుడు హరీష్‌. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తుంది. తాజాగా మరో పవర్‌ఫుల్‌ లుక్‌ని విడుదల చేసి ఆసక్తికర విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది చిత్రబృందం. అదేంటంటే.. ఆగస్టు 15న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ‘వరుణ్‌ తేజ్‌ బ్రాండ్‌ న్యూ అవతార్‌ను మీ ముందు ఉంచుతున్నందుకు చాలా ఆనందంగా ఉంద’ని చిత్ర దర్శకుడు అభిమానులతో పంచుకున్నాడు. శరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుని సెప్టెంబరు 13న విడుదలకు సిద్ధమవుతుందీ చిత్రం. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే కథానాయిక.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.