కొత్త అల్లుళ్లు వస్తున్నారు!
తెలుగు వారికి ముఖ్యమైన పండగలు చాలానే ఉన్నాయి. వాటిల్లో కొత్త అల్లుళ్లను ఇంటికి తీసుకొచ్చి మర్యాదలు చేసే పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు వెంకటేష్, వరుణ్‌తేజ్‌. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌2’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దిల్‌రాజు సమర్పకుడు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకొని చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో వెంకీ, వరుణ్‌ ఎర్రచొక్కాలేసుకొని, గళ్లలుంగి కట్టుకుని సందడి చేస్తున్న ఆ ఫోటో తెగ సందడిచేస్తోంది. ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లు అందరిని అలరించాయి. తెలుగు కథానాయకుల్లో మల్టిస్టారర్‌ చిత్రాలు చేయాలంటే ముందుగా వినిపించే పేరు విక్టరీ వెంకటేష్‌. ఇప్పటికే బాబాయి పవన్‌తో కలిసి ‘గోపాల గోపాల’లో ప్రధాన పాత్రలో నటించి అలరించాడు. ఇప్పుడు అబ్బాయి వరుణ్‌తేజ్‌ కలిసి ‘ఎఫ్‌2’లో సందడి చేస్తున్నాడు. ఈ ‘ఎఫ్‌2’ బ్యాచ్‌కి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.