విద్యాబాలన్‌ ప్రవచనం

విద్యాబాలన్‌ తరుచుగా సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది. గురునానక్‌ జయంతి సందర్భంగా విద్యాబాలన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి సందేశాన్ని ఇచ్చింది. ‘‘మనిషికి విశ్వాసం అనేది చాలా ముఖ్యం. మనకు ఒ ధృడమైన నమ్మకం, విశ్వాసం ఉంటే కొండనైనా ఢీ కొట్టగలం. ఇది కేవలం మాటలకు పరిమితం కారాదు. వాస్తసం అని గ్రహించాను. మనల్ని నడిపించేది విశ్వాసమే.. కాబట్టి మన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో సడలకుండా ముందుకు కదిలితే విజయం మనదే అంటూ’’ చెప్పింది విద్యాబాలన్‌. ప్రస్తుతం విద్యాబాలన్‌ గణితమేధావి శకుంతలా దేవి జీవితాధారంగా వస్తున్న చిత్రంలో శకుంతలగా నటిస్తోంది. అనుమేనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.