ముగ్గురు కామ్రేడ్లు ఒకటయ్యారు

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్’. తెలుగుతోపాటు తమిళ్‌,మలయాళం,కన్నడ తదితర భాషల్లోనూ విడుదలవుతోందీ సినిమా. ఇందుకు విజయ్‌ ఓ రేంజ్‌లో ప్రోమోట్‌ చేస్తున్నాడు. అన్ని భాషల్లోని అగ్ర నటులతో ట్రైలర్‌ రిలీజ్‌ చేయించడమే కాకుండా ‘కామ్రేడ్‌ మ్యూజికల్‌ ఫెస్టివల్‌’ అంటూ హైప్‌ తెచ్చేస్తున్నాడు. అంతేకాదు దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ సేతుపతితో కలిసి విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్’ సాంగ్‌ పాడి సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు.తమిళంలో విజయ్‌ సేతుపతి, మలయాళంలో దుల్కర్‌,తెలుగులో విజయ్‌ దేవరకొండ పాడిన ఈ పాట.. తాజాగా విడుదలై అందరిని ఆకట్టుకుంటోంది. ‘మౌనమిక చాలుపదా’ అని సాగే ఈ పాటకి చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో దేవరకొండకు జోడీగా రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై భరత్‌ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జులై 26న విడుదల కానుంది.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.