నయా లుక్‌తో అదరగొడుతున్న విజయ్‌

ప్రస్తుతం తెలుగులోని యువ కథానాయకుల్లో ఎక్కువగా వినిపించే పేరు విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌ రెడ్డి’తో చిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకున్నాడు. యువతరంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. వెంçవెంటనే సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా గడిపే ఈ యువ హీరో ఇటీవలే ప్రముఖ ఫిల్మ్‌ మ్యాగజైన్‌ వోగ్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటో షూట్‌లో తనదైన స్టైల్‌ చూపించాడు. ఈ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు విజయ్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పూర్తవకముందే పూరి జగన్నాథ్‌తో మరో సినిమాను మొదలు పెట్టాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.