సెట్స్‌లో అడుగుపెట్టిన విజయశాంతి

టాలీవుడ్‌ ప్రముఖ నటి విజయశాంతి 13ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకుంటున్నారు. ఇంతకాలం విరామం తీసుకున్నాక ఆమె రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్‌ బాబు కథానాయకుడుగా యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రాములమ్మ కనిపించబోతున్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ ఇస్తుండటంతో విజయశాంతి ఎలాంటి లుక్‌లో కనిపిస్తుందో అని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా చిత్ర దర్శకుడు అనిల్‌ చిత్రీకరణలో పాల్గొన్న ఫోటోను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.‘విజయశాంతి గారికి ఇది మేకప్‌ వేసుకునే సమయం. 13 సంవత్సరాలు గడిచినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. అదే పద్ధతి, అదే వ్యక్తిత్వం. స్వాగతం విజయశాంతి గారు’ అని వ్యాఖ్యను జోడించాడు. ఈ ఫోటోలో అద్దంలో తన ముఖం చూసుకుంటూ ఉన్న విజయశాంతి కనిపిస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.