ఎవరీ అజయ్‌ కృష్ణ?

ఆర్మీ దుస్తులపై జాతీయ జండా, ఆర్మీ లోగో... అజయ్‌ కృష్ణ అనే పేరు. చూస్తుంటే ఎవరిదో మేజర్‌ ఫొటో అనుకుంటారు. అవును మీరనుకుంది నిజమే కానీ ఇంతకీ ఎవరా మేజర్‌? అంటారా.. ఇంకెవరు టాలీవుడ్‌ అగ్ర నటుడు మహేశ్‌ బాబు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో మహేశ్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. కశ్మీర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఫొటోను చిత్ర బృందం విడుదల చేసింది. మహేశ్‌ తొలిసారి ఆర్మీ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. రష్మిక కథానాయిక.  ‘ఒక్కడు’లో మహేశ్‌ కబడ్డీ ఆటగాడు అజయ్‌గా, ‘దూకుడు’లో ఐపీఎస్‌ అజయ్‌ కుమార్‌గా సందడి చేశారు. ఈ రెండు సినిమాలు హిట్‌ అందుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం కోసం ఆయన అజయ్‌గా మారడం విశేషం. 






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.