ప్రశ్నిస్తానంటుంది ‘ఎవరు’?

డవి శేష్‌ నటిస్తున చిత్రం ‘ఎవరు’. సరికొత్త థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్‌ విభిన్నంగా ఉండటంతో అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇందులో శేష్‌ నల్ల కళ్లదాలు పెట్టుకుని కనిసిస్తాడు. తన ఎడమ కంటి భాగంలో కథానాయిక రెజీనా అద్దంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు ‘నిజానికి ఒకే మ³ఖం ఉంటుంది. అబద్ధానికి ఎన్నో ఉంటాయి. సమాధానాలన్నీ ఈ ఆగస్టులో ప్రశ్నించబడతాయి’ అంటూ ట్యాగ్‌ చేసి అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రసాద్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి, కేవీఎన్‌ అన్నే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకత్వం వెంకట్‌ రాంజీ.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.