‘అర్జున్‌’ వస్తున్నాడు

కొన్ని సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నా...వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ ఉంటాయి. అప్పుడొస్తున్నాం.. ఇప్పుడొస్తున్నాం అంటూ నెలలు గడుపుతుంటారు దర్శకనిర్మాతలు. ఇటీవల కాలంలో ఇటువంటి పరిస్థితి ఎరుర్కొంటున్న చిత్రం ‘అర్జున్‌ సురవరం’. నిఖిల్‌ కథానాయకుడిగా దర్శకుడు టి.ఎన్‌.సంతోష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్‌29న వస్తున్నాం అని ఇంతకు ముందు ప్రకటించిన సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రచారం చేయకపోవటంతో మరోసారి వాయిదా వేస్తారేమో అనుకున్నారు. మొత్తానికి ఈ సినిమాకి చెందిన కొత్త స్టిల్‌ని విడుదల చేస్తు ఈనెల 29నే ఖచ్చితంగా వస్తున్నాం అని తెలిపింది చిత్ర బృందం. తమిళ ‘కణితన్‌’కి రీమేకే ‘అర్జున్‌ సురవరం’. లావణ్య త్రిపాఠి కథానాయిక, నిఖిల్‌ ఒక పాత్రికేయుడిగా కినిపించనున్నాడు. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.