వరుడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్‌!
టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ త్వరలోనే పెళ్లి చేసుకోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్‌ వెల్లడించారు. ఇటీవలే ఆయన నటించిన చిత్రం ‘రాక్షసుడు’ మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా థ్యాంక్స్‌ మీట్‌కు హారజైన ఆయన తన కుమారుడి వివాహం గురించి ప్రస్తావించారు. ‘త్వరలోనే శ్రీనివాస్‌ పెళ్లి జరగనుంది. సినీ ప్రపంచానికి సంబంధించిన అమ్మాయి కాకుండా వేరే వాళ్లని చూస్తున్నాం. ‘రాక్షసుడు’ చిత్రాన్ని హిట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు. శ్రీనివాస్‌తో పూర్తిస్థాయి కమర్షియల్‌ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నా. దర్శకుడు కోసం అన్వేషిస్తున్నా’నని తెలిపారు. శ్రీనివాస్‌ ఎవర్ని వివాహమాడటంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.