ముఖ్య అతిథిగా మహేష్‌


దాదా సాహెబ్‌ ఫాల్కే దక్షిణ భారత పురస్కార వేడుక - 2019 హైదరాబాద్‌లో సెప్టెంబరు 20న జరగనుంది. మహేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుకలో దక్షిణాది చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖుల్ని సత్కరించనున్నారు. సమంత, జగపతిబాబు, అనుష్క, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దేవిశ్రీప్రసాద్‌, బ్రహ్మానందం, నందిత శ్వేత, పాయల్‌ రాజ్‌పుత్‌, ఛార్మి, పూరి జగన్నాథ్‌, లక్ష్మి మంచు, మోహన్‌బాబు తదితర తారలు హాజరవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ‘‘బాలీవుడ్‌లో ఇటీవలే ఈ వేడుక జరిగింది. హైదరాబాద్‌లోనూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం. సినీ తారలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరవుతార’’ని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.