ఈ మాయ... ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌లో మరో వారసుడు హీరోగా రాబోతున్నాడు. అతడే స్టంట్‌ మాస్టర్‌ విజయ్‌ కుమారుడు రాహుల్‌ విజయ్‌. తాజాగా రాహుల్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. హీరోయిన్‌గా కావ్య థాపర్‌ నటిస్తుంది. రాము కొప్పుల దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఎస్‌.వి వర్క్స్‌ బ్యానర్‌లో దివ్య విజయ్‌ నిర్మిస్తున్నారు. మణిశర్మ బాణీలు అందించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను నటుడు వరుణ్‌ తేజ్‌ విడుదల చేశారు. వరుణ్‌తేజ్‌ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సినిమా విజయం సాధించి రాహుల్‌ విజయ్‌ హీరోగా రాణించాలన్నారు. దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ ‘‘మా సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన వరుణ్‌తేజ్‌కి కృతజ్ఞతలు. ఫస్ట్‌లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మణిశర్మగారి సంగీతం, నేపథ్య సంగీతంక, శ్యామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, నవీన్‌ నూలి ఎడిట్‌ వర్క్‌ సినిమాకు ప్లస్‌ అవుతాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత దివ్య విజయ్‌ మాట్లాడుతూ ‘‘సినిమాను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు. చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, మురళీశర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేశ్‌, సత్యం రాజేశ్‌, జోశ్‌ రవి, కాదంబరి కిరణ్‌ తదితరులు నటిస్తున్నారు. ఫైట్స్‌: విజయ్‌, ఎడిటర్‌: నవీన్‌ నలి, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: శ్యాయ్‌ కె.నాయుడు.


© Sitara 2018.
Powered by WinRace Technologies.