గోవా చిత్రోత్సవానికి ‘ఎఫ్‌ 2’
ఏడాది విజయవంతమైన చిత్రం ‘ఎఫ్‌ 2’. వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రధారులు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) చిత్రోత్సవాల్లో ‘ఎఫ్‌ 2’ని ప్రదర్శించబోతున్నారు. నవంబరులో గోవా వేదికగా ఈ ఉత్సవం జరగబోతోంది. ఇండియన్‌ పనోరమా విభాగం కోసం తెలుగు నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా ఇదే. ‘‘చిత్రోత్సవాల కోసం ‘ఎఫ్‌ 2’ని ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఇదో గౌరవంగా భావిస్తున్నాం’’ అని దిల్‌రాజు తెలిపారు. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.