మహేష్‌ కాంపౌండ్‌లోకి నిధి

ఘట్టమనేని కాంపౌండ్‌ నుంచి మరో వారసుడిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయటానికి రంగం సిద్ధమైంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. ‘దేవదాసు’ లాంటి మల్టిస్టారర్‌ చిత్రం తరువాత శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమర రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆదివారం ఉదయం రామానాయుడు స్టూడియోస్స్‌లో ముహుర్తం షాట్‌ని తీయనున్నారు. ఈ చిత్రం ప్రారంబోత్సవానికి మహేష్‌ బాబు సహా మరికొందరు సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.