గోపీచంద్‌ సరసన తమన్నా

ఇటీవలే గోపీచంద్‌ 28వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్‌.ఎస్‌. స్క్రీన్స్‌ పతాకంపై నిర్మాత చిట్టూరి శ్రీనివాస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్‌ నంది. అయితే ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారో చెప్పకుండా అభిమానుల్ని సందేహంలో పడేసింది చిత్ర బృందం. తాజాగా ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన తమన్నాను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు దర్శక, నిర్మాతలు. ఇది ఎలాంటి కథ, సాంకేతిక నిపుణులు తదితర విషయాలు త్వరలోనే ప్రకటించనున్నారు. గతంలో సంపత్‌ నంది రామ్‌ చరణ్‌తో తెరకెక్కించిన ‘రచ్చ’, రవితేజతో తీసిన ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాల్లో తమన్నానే కథానాయిక.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.