తమిళ ‘అర్జున్‌రెడ్డి’ టీజర్‌ వచ్చేస్తోంది

తె
లుగు చిత్రసీమ ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’ని తమిళ్‌లో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్‌ తనయుడు ధృవ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న తొలి చిత్రమిది. భణిత సంధు కథానాయికగా నటిస్తోంది. సందీప్‌ వంగా శిష్యుడు గిరీశయ్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాలా ‘వర్మ’ పేరుతో తెరకెక్కించగా.. అవుట్‌పుట్‌ సంతృప్తికరంగా లేకపోవడంతో చిత్ర నిర్మాతలు దాన్ని పక్కకు పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త దర్శకుడితో దీన్ని మళ్లీ ఫ్రెష్‌గా తెరకెక్కించడం మొదలుపెట్టారు. ఇదే ఇప్పుడు ‘ఆదిత్య వర్మ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. జూన్‌ 16న టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్‌ను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. పోస్టర్‌లో ధృవ్‌ లుక్స్‌.. బాలా ‘వర్మ’తో పోల్చుకుంటే చాలా బెటర్‌గా కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి సినిమా కూడా ఏ రేంజులో ఉండబోతుందన్నది రేపు విడుదలయ్యే టీజర్‌తో అర్థమైపోతుంది. ఇక ఇదే చిత్రం హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ కాగా.. అది జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.