ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రద్దు.. ప్రచారపర్వంకు బ్రేక్‌!

భారీ అంచనాల మధ్య ‘కల్కి’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలకు అనూహ్యంగా విరామం ప్రకటించింది. ‘గురుడవేగ’ వంటి హిట్‌ తర్వాత రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. ‘అ!’ ఫేం ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. అదా శర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జూన్‌ 28న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం విడుదల ముందస్తు వేడుకను నిర్వహించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేసుకుంది. కానీ, ఈ వేడుకను రద్దు చేస్తున్నట్లు మీడియాకు సందేశాలు అందాయి. ఇలా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను అర్ధంతరంగా రద్దు చేయడానికి కారణమేంటంటే.. చిత్ర హీరో రాజశేఖర్‌ కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండటమేనట. కొన్నిరోజులుగా ఆయన ఇటు షూటింగ్, అటు ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడపడం వల్ల అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ప్రమోషన్స్‌ను తాత్కాలికంగా ఆపివేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు రాజశేఖర్‌ పాల్గొనాల్సిన మిగతా ప్రచార కార్యక్రమాలు సైతం రద్దు చేశారట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.