కొత్త కబురు వినిపించిన కల్యాణ్‌రామ్‌
‘పటాస్‌’ నుంచి కథల్లో వైవిధ్యతను చూపిస్తూ వస్తున్నారు యువ హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈ దారిలోనే ఇటీవల ‘118’ చిత్రంతో వచ్చి ప్రేక్షకుల్ని మెప్పించారాయన. ఇప్పుడీ జోరులోనే తన 17వ చిత్రాన్ని ప్రకటించేశారు కల్యాణ్‌ రామ్‌. సతీశ్‌ వేగేష్న దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించనున్నారు. కల్యాణ్‌కు జోడీగా మెహరీన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఓ సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథతో ఈ మూవీని రూపొందించనున్నారట. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారికంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక దీనికి సంగీత దర్శకుడిగా గోపీ సుందర్‌ వ్యహరించబోతున్నారు. 

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.