‘పవర్‌ స్టార్‌’కి సూపర్‌ స్టార్‌ ఛాలెంజ్‌

ప్రముఖ నటుడు ఒకప్పటి అగ్ర కథానాయకుడు, ఒక తరం ప్రేక్షకులకు సూపర్‌ స్టార్‌ కృష్ణ, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి ఛాలెంజ్‌ విసిరారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కృష్ణ. దీన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ను అభినందించారు. త్వరలోనే గ్రీన్‌ ఛాలెంజ్‌ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్‌లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో కృష్ణతో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్, నటుడు కాదంబరి కిరణ్‌ పాల్గొన్నారు. ఇప్పుడు గ్రీన్‌ ఛాలెంజ్‌ చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటిన విషయం తెలిసిందే.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.