జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి‘

 జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌.. ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి
మెరిసిన ‘అ’.. ‘రంగస్థలం’.. ‘కేజీఎఫ్‌’


ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ‘మహానటి’కి అవార్డు దక్కింది. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ టైటిల్‌రోల్‌ పోషించారు. దీంతో పాటు ఇదే సినిమాతో ఉత్తమ జాతీయ నటిగా ఎంపికయ్యారు కీర్తి సురేష్‌. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌లు కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది.

                                 

 ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
 ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)
 ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్‌(ఉరి)
 ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌(మహానటి)
 ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే(చంబక్‌)
 ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్‌ హో)

 ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
 ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్‌
 ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్‌ హో
 ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్‌: మరాఠీ)
 జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌

 జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి 
 జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌ 
 జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
 ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ(పద్మావత్‌) 
 జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్‌
 ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)

 ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం:  చి||ల||సౌ||
 ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్‌(కన్నడ)
 ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
 ఉత్తమ మేకప్‌: ‘అ!’
 ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: మహానటి
 ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)


 ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
 ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
 ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌
 ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాలీ)
 ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
 ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
 ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే
 నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.