ఇది అది కాదు: మారుతి

కొన్ని సినిమాల పోస్టర్, పాటలు విడుదలైతే.. ఇది గతంలో వచ్చిన ఫలానా చిత్రాన్ని పోలి ఉందనే వార్తలు వస్తుంటాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతుంటుంది. యువ కథానాయకుడు సాయి ధరమ్‌తేజ్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంపై ఇదే చర్చ సాగింది. నటీనటులందరూ కలిసి ఉన్న ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో ఇది కుటుంబ కథా నేపథ్యంలో సాగే సినిమా అనే ఆలోచనకు వచ్చేశారు నెటిజన్లు. అక్కడితో ఆగకుండా ఇది ఆ సినిమా కథే, అదే విధంగా ఉంటుందంటూ కొన్ని చిత్రాల పేర్లను చెప్పుకొచ్చారు. ఇటీవలే ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు మారుతి. ‘‘ప్రతిరోజూ పండగే’ చిత్రం గురించి రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. ఇది అందరూ ఊహించిన కథ కాదు. ఇప్పటి వరకు ఇలాంటి కథ వెండితెరపైకి రాలేదు. మనిషి పుట్టినపుడు వేడుక చేసుకుంటున్నట్లుగానే చనిపోయేటపుడు ఆనందం అందించాల్సిన బాధ్యత ఉంది. దీన్నే తెరపై చూపించబోతున్నామ’ని విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశాడు మారుతి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.