క్రేజీ కాంబినేషన్‌పై.. అధికారిక ప్రకటన ఇదుగో..

నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతుందని కొద్దిరోజులుగా ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడింది. తాజాగా చైతూ - శేఖర్‌ కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ చిత్ర బృందం ఈ విషయాన్ని తెలియజేసింది. ‘ఎన్‌.సి.20’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ చిత్రంలో చైతూకు జోడీగా సాయిపల్లవిని ఖరారు చేశారు. సెప్టెంబరు తొలివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టి.. డిసెంబరు నాటికి సినిమాను విడుదల చేసేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట. ‘ఫిదా’ వంటి హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల నుంచి రాబోతున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం చైతూ.. వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.