దిల్‌రాజు ప్రేమకథలో .. చైతు - రష్మిక

ఒకేసారి నాలుగైదు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ఆయన సినిమాలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతాయి. ప్రతి సీజన్‌లోనూ ఆయన్నుంచి ఒక సినిమా రావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆయన మరో చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య, రష్మిక జంటగా నటిస్తారని తెలుస్తోంది. శశి అనే యువకుణ్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అదే నువ్వు.. అదే నేను’ అనే టైటిల్‌ నిర్ణయించినట్టు సమాచారం. స్క్రిప్టు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అటు చై, ఇటు రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాల్షీట్లు కుదరగానే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.