లేటుగా వస్తున్న ఆఫీసర్‌

వర్మ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆఫీసర్‌’. ఈనెల 25న విడుదల కావాల్సివుంది. అయితే... అనుకున్న సమయానికి ‘ఆఫీసర్‌’ రావడం లేదు. ఓ వారం ఆలస్యంగా అంటే, జూన్‌ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘ఆఫీసర్‌’ ఆలస్యానికి కారణం.. సాంకేతిక పరమైన సమస్యలా, లేదంటే వేరే ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సివుంది. వచ్చేవారం బాక్సాఫీసు దగ్గర ముక్కోణపు పోటీ ఉంటుందని సినీ అభిమానులు భావించారు. ‘ఆఫీసర్‌’, ‘నేల టికెట్టు’, ‘అమ్మమ్మగారి ఇల్లు’ ఒకేరోజు రాబోతున్నాయి. ‘ఆఫీసర్‌’ వెనక్కి తగ్గడంతో పోటీ కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది. ‘శివ’, ‘అంతం’, ‘గోవిందా గోవిందా’ తరవాత నాగ్‌ − వర్మల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఇందులో నాగ్‌.. హైదరబాదీ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.
సంబంధిత వ్యాసాలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.