ఎన్టీఆర్‌ అసామాన్యుడు
ఎన్టీ‌ఆర్‌ సినిమా శర‌వే‌గంగా చిత్రీ‌క‌రణ జరు‌పు‌కొం‌టోంది.‌ ఎట్టి పరి‌స్థి‌తు‌ల్లోనూ ఈ యేడాది ద్వితీ‌యా‌ర్థంలో ప్రేక్ష‌కు‌లకు చూపిం‌చా‌ల్సిందే అని కంకణం కట్టు‌కొ‌న్న‌ట్టు‌న్నాడు దర్శ‌కుడు త్రివి‌క్రమ్‌.‌ అందుకే ఒక పక్క తెర‌వె‌నక పనుల్ని, మరొ‌క‌పక్క చిత్రీ‌క‌ర‌ణకి సంబం‌ధిం‌చిన పనుల్ని వేగంగా పూర్తి‌చే‌స్తు‌న్నారు.‌ ప్రస్తుతం హైద‌రా‌బా‌ద్‌లో చిత్రీ‌క‌రణ జరు‌గు‌తోంది.‌ కథా‌నా‌యిక పూజా హెగ్డే ఇటీ‌వలే సెట్లోకి అడు‌గు‌పె‌ట్టింది.‌ కథా‌నా‌య‌కుడు ఎన్టీ‌ఆర్, ఇతర చిత్రబృం‌దంపై ఇప్ప‌టికే ఒక షెడ్యూల్‌ చిత్రీ‌క‌రణ పూర్త‌యింది.‌ మరో‌పక్క జోరుగా సంగీత చర్చలు కొన‌సా‌గు‌తు‌న్నాయి.‌ ఎన్టీ‌ఆర్‌ పుట్టి‌న‌రో‌జును పుర‌స్క‌రిం‌చు‌కొని త్వర‌లోనే ఫస్ట్‌‌లు‌క్‌ని విడు‌దల చేయ‌డా‌నికి సన్నా‌హాలు చేస్తు‌న్నట్టు తెలు‌స్తోంది.‌
−‌ మాటల కోసం ప్రత్యేక కస‌రత్తు:‌ త్రివి‌క్రమ్‌ సిని‌మాల్లో మాట‌ల‌కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.‌ ఆయన మార్క్‌ మాటల కోసమే థియే‌ట‌ర్‌కి వచ్చే ప్రేక్ష‌కులు ఎంతో మంది.‌ అందుకే ఆ విష‌యంలో త్రివి‌క్రమ్‌ ఎప్ప‌టి‌క‌ప్పుడు ప్రత్యే‌క‌మైన జాగ్రత్తలు తీసు‌కొం‌టుం‌టారు.‌ తన కలా‌నికి మరింత పదును పెడుతూ మాటలు రాస్తుం‌టారు.‌ స్వంతంగా మాటలు రాసు‌కొనే త్రివి‌క్రమ్‌ ఈసారి మరొక రచ‌యిత సహాయం కూడా తీసు‌కొం‌టు‌న్నట్టు సమా‌చారం.‌ అందుకు కారణం రాయ‌ల‌సీమ యాస అని ఫిల్మ్‌‌న‌గర్‌ జనాలు మాట్లా‌డు‌కొం‌టు‌న్నారు.‌ ‘అసామాన్యుడు’ టైటిల్‌ పరిశీలన ఉంది. కథ రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగు‌తుం‌దని, అక్కడి పాత్రలు పక్కాగా ఆ యాసలో మాట్లా‌డాలి కాబట్టి, ఆ యాసపై పట్టున్న ఒక రచ‌యిత సహాయం తీసు‌కొం‌టు‌న్నట్టు తెలి‌సింది.‌© Sitara 2018.
Powered by WinRace Technologies.