పవన్‌ సినిమా...అధికారిక ప్రకటన

తెలుగులో రికార్డు స్తాయి వసూళ్లు సాధించగల అగ్ర కథానాయకులలో ఒకడు పవన్‌ కళ్యాణ్‌. గత వారం రోజుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా పవన్‌ చేయబోయే గురించి చాలా వదంతులు వినిపించాయి. అయతే వీటికి స్వస్తి పలుకుతూ పవన్‌ చేయబోయే సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినీ వెశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా వెల్లడించాడు. హిందీలో అమితాబ్‌ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పింక్‌’ని పవన్‌ తెలుగులోకి తీసుకురాబోతున్నట్లు తరుణ్‌ తెలిపాడు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుతో కలసి బోని కపూర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని, ఈ చిత్రానికి ‘ఎంసీఏ’ దర్శకుడు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించనున్నారని తరుణ్‌ తన పోస్ట్‌ ద్వాదా వివరించాడు. శర వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి తొంరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతల ఆలోచనట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.