సహకరించిన వారందరికీ ధన్యవాదాలు

ప్రభాస్‌ నటించిన ‘సాహో’ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నాలుగు చిత్రాలు వాయిదా పడ్డాయి. ఈ సినిమా కోసం తమ చిత్రాల విడుదల తేదీలను మార్చుకున్న దర్శక, నిర్మాతలకు ప్రభాస్‌ ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ‘సాహో’ను ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలనుకున్నా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో 30కి వాయిదా పడింది.అదే రోజు రిలీజ్‌ చేసేందుకు థియేటర్ల సమస్య కారణంగా ఇతర చిత్రాల నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సోషల్‌ మీడియా వేదికగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘సాహో కోసం తమ చిత్రాల విడుదలను రీ-షెడ్యూల్‌ చేసుకున్న నటీనటులు,దర్శకులు,నిర్మాతలకు బిగ్‌ థ్యాంక్స్‌. మీకు అల్‌ ది బెస్ట్‌. మీపై ప్రేమ,గౌరవం ఎప్పుడూ ఉంటాయి’ అని ప్రకటించారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.