పూరి దారికొచ్చిన రౌడీ

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఫలానా దర్శకుడుతో ఫలానా హీరో చేస్తే అభిమానులకు పండగే అనే జాబితా టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఇందులో మొట్ట మొదటిగా వినిపించే పేర్లు దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్‌ దేవరకొండ. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో తన మార్క్‌ చూపించిన పూరి తర్వాత ఎవరితో తీయనున్నాడా అనే సందేహం అటు అభిమానుల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో ఉంది. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో చేస్తాడంటూ వార్తలు వచ్చినా ఇప్పటి వరకు వారు స్పందిచకపోవడంతో ఆ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని అభిమానలు ఆశగా ఎదురు చూసేవారు. అన్ని ఓకే అయినప్పటికీ ఈ సినిమా నిర్మించేందుకు ఎవరు ముందుకొస్తారనేది మరో సమస్య. ఎందుకంటే పూరి గత కొంతకాలంగా పూరి కనెక్స్ట్‌ బ్యానర్‌పై తానే స్వయంగా చిత్రాలు రూపొందిస్తున్నాడు.  తాజాగా అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చేశారు. లావణ్య సమర్పణలో విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని పూరి, ఛార్మికౌర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా నటి,నిర్మాత ఛార్మి ప్రకటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇటేవలే పూరి ఓ మోడల్‌ను ఎంపిక చేసి ఫోటో షూట్‌ చేశాడు. ఆ మోడల్‌ విజయ్‌ సరసన నటించేందుకో కాదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. 
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.