
సినీ కెరీర్ ఆరంభంలో హ్యట్రిక్ విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రాజ్ తరుణ్. ఏడాదికి రెండు, మూడు చిత్రాలతో పలకరించే ఈ యువ నటుడు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో ‘ఓరేయ్ బుజ్జిగా’ లో నటిస్తున్నాడు. ఇందులో హెబ్బా పటేల్ మరోసారి రాజ్‌తరుణ్‌తో జోడీ కడుతుంది. ‘కుమారి21ఎఫ్’తో మొదలు వీరిద్దరి కలయికలో నాలుగు చిత్రాలోచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినవి దాదాపుగా విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అయితుందనే నమ్మకంతో ఉన్నాడు రాజ్‌తరుణ్. మాళవిక నాయర్ మరో నాయికగా నటిస్తోంది. ఇందులో హబ్బా పటేల్ పాత్ర చిత్రానికే ప్రధాన ఆకర్షణ అని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోని విడుదల చేసింది చిత్ర బృందం.