డిసెంబర్‌ 20న ‘ప్రతిరోజూ పండగే’

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా కథానాయిక నటిస్తోంది. జీఏటు2, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరు 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘వినోదాత్మక చిత్రమిది. కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఉంది. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌నీ విడుదల చేశాం. వాటికి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే అమెరికాలో సినిమా షూటింగ్‌ జరగబోతోంద’’న్నారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ, సత్యం రాజేష్‌ తదితరులు నటిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.