రెండు రోజుల్లో ‘పండగ’ సందడి

మరో రెండు రోజుల్లో ‘పండగ’ సందడిని మరింత పెంచుతున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ‘చిత్రలహరి’ విజయం తరువాత ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రతి రోజు పండగే’. మారుతి దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పరిచాయి. తాజాగా డిసెంబర్‌ 4న ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ఇందులో తేజ్‌ లుక్‌ కొత్తగా ఉంది. ఈ లుక్‌ వెనుక సత్యరాజ్‌ నీడ కనిపిస్తుంది. ఇందులో తాత-మనవడి మధ్యలో సాగే అనుంబంధాలు ప్రధానంగా ఉంటాయని తెలుస్తుంది. తాత పాత్రతో సత్యరాజ్‌ నటిస్తున్నాడు. డిసెంబర్‌ 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదే రోజున బాలయ్య ‘రూలర్‌’తో పాటుగా తమిళ డబ్బింగ్‌ సినిమా కార్తి ‘దొంగ’, హిందీ డబ్బింగ్‌ చిత్రం సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌ 3’ కూడా తెలుగు ప్రేక్షకులను అలరించటానికి సిద్ధం అవుతున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.