పల్లెటూరి అల్లరిపిల్లగా...సమంత
‘రంగస్థలం’లో పల్లెటూరి అమ్మాయిగా తన వయ్యారాలతో అందరిని కట్టిపడేసిన సమంత ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రనే ధరించబోతోంది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా ‘సీమారాజా’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల సమంతే మీడియాకు వెల్లడించింది. సమంత తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘‘నేనొక పల్లెటూరి అమ్మాయిగా పంజాబీ (పడ్వాయి ధావని) దుస్తుల్లో శివకార్తికేయన్‌తో కలిసి నటిస్తున్నాను. సినిమా కోసం తమిళ మార్షల్‌ ఆర్ట్స్ గా పిలిచే ‘సిలంబన్‌’ యుద్ధవిద్యలో శిక్షణ తీసుకున్నా. హాస్యంతో కూడిన నాటకంలా ఉంటుందీ సినిమా’’ అన్నారు. చిత్రంలో హీరోగా శివకార్తికేయన్‌ నటిస్తున్నాడు. పొన్రమ్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌.డి.రాజా నిర్మాత. డి.ఇమ్రాన్‌ బాణీలు అందించారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.