నవాజుద్దీన్‌ నటన ఇష్టం

ర్శకుడిగా మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నాడు తరుణ్‌ భాస్కర్‌. కథానాయకుడిగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ వెండి తెరపై నవ్వుల పువ్వలు పూయిస్తున్నాడు. అయితే నటన కంటే దర్శకత్వమే మక్కువ అని చెప్పే భాస్కర్‌ తన తదుపరి చిత్రం కూడా ఒక ప్రయోగాత్మకంగా ఉంటుంది చెప్పాడు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ప్రయోగాలంటే తనకు చాలా ఇష్టమని తన తదుపరి చిత్రం కూడా ఒక విభిన్నమైన కథతో వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని తెలిపారు. అలాగే నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటన అంటే చాలా ఇష్టం అని ఆయనను ఎప్పటికైనా దర్శకత్వం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం ‘మీకు మాత్రమే చెప్తా’ విజయానందంలో ఉన్నారు తరుణ్‌ భాస్కర్‌. తరువాత వెంకి సినిమాకి దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. మరి ఇందులో నవాజుద్దీన్‌ కోసం ప్రత్యేకంగా పాత్రను సృష్టిస్తారేమో చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.